బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 19:03:08

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ద్విచక్రవాహనం బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ములుగు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


logo