బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 07:50:17

'ఔట‌ర్'‌పై ఢీకొన్న కార్లు.. ఇద్ద‌రు మృతి

'ఔట‌ర్'‌పై ఢీకొన్న కార్లు.. ఇద్ద‌రు మృతి

హైద‌రాబాద్‌: ర‌ంగారెడ్డి జిల్లా నార్సింగి వ‌ద్ద ఔట‌ర్ రింగ్‌రోడ్డుపై రెండుకార్లు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. శంషాబాద్ నుంచి గ‌చ్చిబౌలి వెళ్తున్న కారు ఈరోజు ఉద‌యం నార్సింగి ఔట‌ర్ రింగ్‌రోడ్డు బ్రిడ్జి కింద మ‌రో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రొక‌రిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. మ‌ద్యం మ‌త్తులో కారు న‌డిపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మృతులు సూర్యాపేట‌కు చెందిన‌వారిగా గుర్తించారు. 


logo