శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 12:14:02

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు మృతి

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌ : విద్యుత్‌ షాక్‌ తగిలి ఇద్దరు మృతి చెందిన ఘటన నార్నూర్ మండలం పర్సు వాడలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన రాథోడ్ ప్రహ్లాద అనే వికలాంగుడు ఉదయం కాలకృత్యాలకు పోతుండగా గోడకు ఆనుకొని ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కొంతసేపటి తర్వాత అటుగా వచ్చిన రాథోడ్ రాజేష్ అనే వ్యక్తి ప్రహ్లాద్ పడిఉండడం చూసి అతన్ని తట్టి లేపే ప్రయత్నం చేశాడు.

దీంతో రాజేష్‌కు కూడా షాక్‌ తగిలి మరణించాడు. ఉదయం ఇద్దరిని గమనించిన గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందిచారు. దీంతో వెంటనే వారు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలను తెలుసుకుంటున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo