ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 11:34:50

పంచాయ‌తీ ట్రాక్ట‌ర్ బోల్తా.. ఇద్ద‌రు మృతి

పంచాయ‌తీ ట్రాక్ట‌ర్ బోల్తా.. ఇద్ద‌రు మృతి

హైద‌రాబాద్‌: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో పంచాయ‌తీ ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డ‌టంతో ఇద్ద‌రు మృతిచెందారు. జిల్లాలోని గుండాల మండ‌లం ముత్తాపురంలో గ్రామ‌పంచాయ‌తీ ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. మృతులు పూనెం వ‌సంత‌రావు, పూనెం బుచ్చ‌య్య అని పోలీసులు తెలిపారు. వ‌సంతరావు ట్రాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడ‌ని, పూనెం బుచ్చ‌య్య గ్రామ‌పంచాయ‌తీ పారిశుధ్య కార్మికుడ‌ని చెప్పారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖానకు త‌ర‌లించారు.