గురువారం 04 జూన్ 2020
Telangana - May 03, 2020 , 07:32:57

జూన్‌లో రెండు కిలోల పప్పు ఉచితం

జూన్‌లో రెండు కిలోల పప్పు ఉచితం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆహారభద్రత కార్డుదారులకు జూన్‌ నెలలో రెండు కిలోల చొప్పున కందిపప్పు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నిజామాబాద్‌, వరంగల్‌ రూరల్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో శుక్రవారం నుంచి బియ్యంతో పాటు పప్పు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో 87.55 లక్షల మంది ఆహార భద్రత కార్డుదారులకు మూడు నెలలకు 28,240 టన్నుల కందులు అవసరమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఏప్రిల్‌ కోటా కింద 8,754 టన్నుల కందులు సరఫరాచేయాల్సి ఉండగా, 3,223 టన్నులనే నాఫెడ్‌ అందజేసింది. వీటిని పప్పుగా మార్చగా, ఈ నిల్వలు నాలుగు జిల్లాలకే సరిపోతున్నాయి. మిగతా కోటా కందులను పప్పుగా మార్చేందుకు మార్క్‌ఫెడ్‌ షార్ట్‌ టెండర్లను పిలిచి, మిల్లర్లకు అప్పగించాల్సి ఉన్నది. మిల్లర్లు పప్పును ప్రభుత్వ గోడౌన్లు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు ఈనెల 20 నాటి కి తరలిస్తే 31 వరకు గ్రామాల్లోని రేషన్‌ దుకాణాలకు చేర్చేందుకు వీలవుతుంది. 


logo