సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 12:00:10

టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరు జ‌డ్పీటీసీలు

టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరు జ‌డ్పీటీసీలు

కామారెడ్డి  : జిల్లాలో టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్దన్ సమక్షంలో కాంగ్రెస్ కు చెందిన భిక్కనూర్, దోమకొండ జడ్పీటీసీలు పద్మ, తిరుమల్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ కు చెందిన పలువురు సర్పంచ్ లు, వార్డు మెంబర్లు కూడా టీఆర్ఎస్ లో చేరారు.


logo