గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 07:48:24

బంజారాహిల్స్‌లో బెంజి కారు బీభత్సం

బంజారాహిల్స్‌లో బెంజి కారు బీభత్సం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఓ బెంజి కారు ఆగిఉన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లో అతివేగంగా వచ్చిన ఓ బెంజి కారు ఆగిఉన్న ఇండికా కారును ఢీకొట్టింది. దీంతో ఇండికా కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బెంజి కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కారు నడిపిన హార్దిక్‌ రెడ్డి, అతనితోపాటు ఉన్న అఖిల్‌ ప్రమోద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోఘటనలో మాదాపూర్‌లో ఓ బైకు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రగా గాయపడ్డారు. అతడిని దవాఖానకు తరలించారు.