గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 20:10:49

ఎల్లంప‌ల్లి ఫ్ల‌డ్‌ గేట్లు రెండు ఎత్తివేత‌

ఎల్లంప‌ల్లి ఫ్ల‌డ్‌ గేట్లు రెండు ఎత్తివేత‌

పెద్ద‌ప‌ల్లి : శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి ప్రాజెక్టు ఫ్ల‌డ్ గేట్ల‌ను రెండింటిని ఎత్తి అధికారులు నీటిని గోదావ‌రి న‌దిలోకి వ‌దిలారు. గ‌డిచిన 15 రోజుల్లో ఇలా చేయ‌డం ఇది రెండోసారి. శుక్ర‌వారం ప్రాజెక్టు రెడు క్ర‌స్ట్ గేట్ల‌ను ఎత్తి 5,572 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాల నుండి రిజర్వాయర్‌కు అధికంగా వ‌ర‌ద‌నీరు కొన‌సాగుతుండ‌టంతో ప్రాజెక్ట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు 6,142 క్యూసెక్ల ప్రవాహం కొన‌సాగుతుండ‌గా 5,572 క్యూసెక్స్ నీరు దిగువకు విడుదలవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామ‌ర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్ర‌స్తుతం 19.5641 టీఎంసీల‌ నీరు అందుబాటులో ఉంది. ఈ వర్షాకాలంలో మొదటిసారిగా ఈ నెల 17 న వరద గేట్లను ఎత్తారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కార‌ణంగా ప్రాజెక్టుకు భారీగా ప్రవాహాలు రావడంతో ఎనిమిది ఫ్లడ్ గేట్లను ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. logo