గురువారం 04 జూన్ 2020
Telangana - May 02, 2020 , 17:02:44

ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు రైతులు మృతి

ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు రైతులు మృతి

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని మాడ్గుల మండలం ఇర్విన్‌ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో మిర్చి రైతులు రామచంద్రయ్య, తోట సుబ్బయ్య మృతి చెందగా, మరో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు చారకొండ మండలం శాంతిగూడెం వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo