బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:30

నాడిపట్టిన నకిలీ డాక్టర్లు

నాడిపట్టిన నకిలీ డాక్టర్లు

  • ఒకరు చదివింది పది, మరొకరు ఇంటర్‌
  • డాక్టర్‌ పేరుతో సేవలు 
  • నకిలీ సర్టిఫికెట్లతో దవాఖాన నిర్వహణ
  • కరోనా మందుల దందా ముఠా విచారణలో  వెలుగులోకి.. కేటుగాళ్ల అరెస్టు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ అవతారమెత్తి దవాఖాన పెట్టిన ఇద్దరు నకిలీ డాక్టర్లను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పో లీసులు ఆదివారం అరెస్టుచేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. మెహిదీపట్నంకు చెందిన మ హ్మద్‌ సోహెబ్‌ సుభానీ, మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌ స్నేహితులు. సోహెబ్‌ ఇంటర్‌ పూర్తిచేశాడు. ఓ టెక్నో స్కూల్‌ను నిర్వహించాడు. ముజీబ్‌ పదో తరగతి చదివాడు. హుమాయిన్‌నగర్‌లో ని ఎంఎం దవాఖానలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. దవాఖాన వ్యాపారం లో మంచి లాభాలుంటాయని సోహెబ్‌తో ముజీబ్‌ చెప్పాడు. దీంతో సోహెబ్‌ దవాఖాన పె ట్టాలని నిర్ణయించాడు. డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌ అనే పేరుతో ఓ నకిలీ ఆధార్‌కార్డును సృష్టించి దాని ఆధారంగా సోహెబ్‌.. సమీర్‌ దవాఖానను ప్రారంభించి ముజీబ్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాడు. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌తో డీఎంహెచ్‌వోలో 2017 నుంచి 2022 వరకు అనుమతి పొంది మోహిదీపట్నంలో సమీర్‌ దవాఖానను నిర్వహిస్తున్నారు. దీనికి ముజీబ్‌ ఎండీ. కొవిడ్‌-19 యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న కొందరు మెడికల్‌ ఏజెన్సీలు, మెడికల్‌ షాపుల నిర్వాహకుల ముఠాను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు బృందం శనివారం అరెస్టు చేసింది. వీరిని విచారించగా నకిలీ వైద్యులు దవాఖాన        విషయం బయటపడింది. పోలీసులు.. ముజీబ్‌, సోహెబ్‌ను అరెస్ట్‌చేసి, రిజిస్ట్రేషన్‌ పత్రం, డాక్టర్‌ ముజీబ్‌ పేరుతో తయారుచేసిన నకిలీ ఆధార్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.  


logo