బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 19:21:37

మ‌త్తుప‌దార్థాల విక్ర‌య‌దారులు ఇద్ద‌రు అరెస్టు

మ‌త్తుప‌దార్థాల విక్ర‌య‌దారులు ఇద్ద‌రు అరెస్టు

హైద‌రాబాద్ : మ‌త్తు ప‌దార్థాలు విక్ర‌యిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్టు చేశారు. స‌మాచారంపై న‌గ‌రంలోని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ రైడ్ చేసి టి. సూర‌జ్ సింగ్‌(27), జి. ల‌లిత్ కుమార్‌(24) అనే ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. వీరిరువురు మంగ‌ల్‌హాట్‌కు చెందిన నివాసితులు. నిందితుల వ‌ద్ద నుంచి 40 గ్రాముల ఛ‌ర‌స్‌ను స్వాధీనం చేసుకున్నారు. త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం సీజ్ చేసిన ఛ‌ర‌స్‌ను, నిందితుల‌ను మంగ‌ల్‌హాట్ పోలీసుల‌కు అప్ప‌గించారు.