సోమవారం 08 మార్చి 2021
Telangana - Sep 25, 2020 , 20:16:24

రాష్ట్రంలో రెండు రోజలు వర్షాలు : ఐఎండీ

రాష్ట్రంలో రెండు రోజలు వర్షాలు : ఐఎండీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా శుక్రవారం హైదరాబాద్‌ సహా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబాబాద్‌, ములుగు, ఖమ్మం, సూర్యపేట జిల్లాలతో మోస్తరు వర్షాలు కురవగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo