గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 22:27:15

గ్రేటర్‌కు రాగల రెండు రోజులు వర్షసూచన

గ్రేటర్‌కు రాగల రెండు రోజులు వర్షసూచన

హైదరాబాద్ : రాగల రెండు రోజులు గ్రేటర్‌లో వాతావరణం చల్లబడడంతో పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. విదర్భ నుంచి రాయలసీమ, మధ్యప్రదేశ్‌ నుంచి తమిళనాడు వరకు రెండు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడడంతో వాటి ప్రభావం వల్ల వర్షం పడనుందని పేర్కొన్నారు.  ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు గురువారంతో పోల్చితే  ఒక డిగ్రీ మేర తగ్గుముఖం పట్టి, రాత్రి ఉష్ణోగ్రతలు 2.4డిగ్రీలు పెరిగాయి.  శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.0డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.1డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 37శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. logo
>>>>>>