నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 63,090 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్టు గేట్లను ఐదడుగుల మేర ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 590 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను 312.04 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.