మంగళవారం 02 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 18:28:35

మహబూబ్‌నగర్‌ పట్టణంలో రెండు కరోనా కేసులు...

మహబూబ్‌నగర్‌ పట్టణంలో రెండు కరోనా కేసులు...

మహబూబ్‌నగర్‌ : నిజాముద్దీన్ నుండి వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్స్ అందరిని హోమ్ క్వారన్ టైన్ లో ఉంచినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  ఆయన కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్. వెంకట రావు ఇతర అధికారులతో కరోనా పై సమావేశం నిర్వహించారు. పట్టణంలో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయని... ఢిల్లీ  నుండి వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్స్ 105 మంది హోమ్ క్వారన్ టైన్ లో ఉన్నారని మంత్రి తెలిపారు. అలాగే ఢిల్లీ నుండి వచ్చిన వారు ఇంకా ఎవరైనా ఉంటే తెలుసుకోవాలని.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన గుర్తించిన వారందరూ తప్పనిసరిగా హోమ్ క్వారన్ టైన్లో ఉండేలా చూడడంతో పాటు వారు ఇతరులను కలిసినట్లయితే వారి వివరాలను కూడా సేకరించాలని సూచించారు. ఒకవేళ ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఆయన కోరారు. సమావేశంలో  డిసిసిబి చైర్మన్ నిజాం పాషా, మున్సిపల్ కమిషనర్ సురేందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo