శనివారం 30 మే 2020
Telangana - May 10, 2020 , 21:58:38

లంచం తీసుకుంటున్న వీడియో వైర‌ల్‌: ఇద్ద‌రు కానిస్టేబుళ్లు స‌స్పెండ్‌

లంచం తీసుకుంటున్న వీడియో వైర‌ల్‌: ఇద్ద‌రు కానిస్టేబుళ్లు స‌స్పెండ్‌

హైద‌రాబాద్‌: ల‌ంచం తీసుకుంటున్న కానిస్టేబుళ్ల వీడియో వైర‌ల్ కావ‌డంతో ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార స‌స్పెండ్ చేశారు. వీరితో పాటు అఫ్జ‌ల్‌గంజ్ పోలీస్‌స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్‌కు ఛార్జ్‌మెమో జారీ చేశారు. బ్లూకోర్ట్ సిబ్బంది పంచ ముఖేశ్‌, సురేశ్‌లు ఇద్ద‌రు పోలీస్ స్టేష‌న్‌లో తీట్టుకున్న‌ట్లు తేల‌డంతో స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌డం లేద‌ని అఫ్జ‌ల్‌గంజ్ ఎస్సైకి ఛార్జ్‌మెమో ఇచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. 

పండ్లు అమ్ముతున్న వ్య‌క్తి నుంచి కానిస్టేబుళ్లు లంచ డిమాండ్ చేస్తుంగా ఒక బిల్డింగ్ పై నుంచి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వీడియో తీశారు. ఒక‌రు డ‌బ్బులు డిమాండ్ చేస్తుండ‌గా మ‌రో వ్య‌క్తి బైక్‌పై వేచి ఉన్నాడు. ఈ వీడియో ఎప్పుడు తీశారో తెలియ‌దు. ఇది సోషల్ మీడియాల వైర‌ల్ కావ‌డంతో క‌మిష‌న‌ర్ దీనిపై విచార‌ణ‌కు ఆదేశించారు. గుర్తించిన పోలీసులు కానిస్టేబుళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. 


logo