శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 02:31:08

‘చాడ’ కారుపై దాడి

‘చాడ’ కారుపై దాడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో పార్క్‌ చేసి ఉన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారు అద్దాలను ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు కర్రతో ధ్వంసం చేసి పరారయ్యారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కార్యాలయానికి చేరుకొని ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా సంఘ విద్రోహశక్తుల పనేనని, వారిపై చర్యలు తీసుకోవాలని చాడ వెంకట్‌రెడ్డి కోరారు.logo