గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 02:45:27

అన్నదమ్ముల దారుణ హత్య

అన్నదమ్ముల దారుణ హత్య

హాలియా/తిరుమలగిరి(సాగర్‌): ప్రతీకార కక్షలకు ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా ప్రత్యర్థులు కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం హజారిగూడెంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. హజారిగూడేనికి చెం దిన జానపాటి ఇస్తారి, రాములమ్మ దం పతులకు కూతురు పార్వతమ్మ, ముగ్గు రు కుమారులు సత్యనారాయణ, హరి, ఆంజనేయులు ఉన్నారు. వీరందరికీ వివాహాలు కావడంతో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. హరి భార్యతో హాలియాకు చెందిన రేవంత్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో హరి.. రేవంత్‌ను మందలించాడు. వారి తల్లిదండ్రులకు సైతం ఫిర్యాదు చేశాడు. గతేడాది పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన హరి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కిరాయి హంతకులతో రేవంత్‌ను హత్యచేయించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న హరి, ఆంజనేయులు, మరికొందరు నల్లగొండ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. హరి, ఆంజనేయులు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. 

అదును చూసి అంతమొందించారు..

బెయిల్‌పై వచ్చిన హరి, ఆంజనేయులును అంతమొందించాలనే ప్రతీకారం తో రేవంత్‌ తల్లి ఇందిర ఇన్నాళ్లు వేచి చూసినట్లు పోలీసుల సమాచారం. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సత్యనారాయణ హజారిగూడెంలోని తన ఇంటిముందు నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో అతడిపై దాడి చేశారు. సత్యనారాయణ ఒక్కసారిగా అరవడంతో పక్క ఇంట్లో నిద్రిస్తున్న తమ్ముడు ఆంజనేయులు బయటకు వచ్చి చూస్తుండగా దుండగులు అతడిపైనా దాడి చేయడంతో కుప్పకూలాడు. అన్నదమ్ములు సత్యనారాయణ, ఆంజనేయులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచా రు. రేవంత్‌ హత్యకు ఇది ప్రతీకార ఘటనగా ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్సై శివకుమార్‌ తెలిపారు. 


logo