గురువారం 28 మే 2020
Telangana - May 20, 2020 , 13:33:14

రోడ్డుప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి

రోడ్డుప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి

నిజామాబాద్‌ : ముపకల్‌ మండలం రెంజర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అన్నదమ్ముల్లిద్దరూ బైక్‌పై వెళ్తుండగా.. బాల్కొండ బైపాస్‌ రోడ్డు కొత్తపల్లి శివారులో వారి బైక్‌ స్కిడ్‌ అయింది. దీంతో ఇద్దరు కిందపడిపోవడంతో.. అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అంబటి అరుణ్‌(22),  అంబటి అరవింద్‌(19)గా పోలీసులు గుర్తించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo