ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 22:06:22

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

బోథ్ : మితి మీరిన వేగం రెండు ప్రాణాలు తీసింది. మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టడంతో ఒకరు, వెనుక బైకు నుంచి కింద పడి మరొకరు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ సమీపంలో  చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుంటాల బీట్‌ అధికారిగా (కవ్వాల టైగర్‌ జోన్‌) పని చేస్తున్న సీహెచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి బైక్‌పై బోథ్‌ వైపు నుంచి పొచ్చెర క్రాస్‌ రోడ్డు వైపు వస్తున్నాడు. అదే వైపు నుంచి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన తలారి వెంకటేశ్‌, ఉడుగు శ్రీకాంత్‌, అర్క మల్లేశ్‌ మరో మోటార్‌ సైకిల్‌పై వస్తున్నారు.

 కుచ్లాపూర్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలో ముందరున్న చంద్రశేఖర్‌రెడ్డి మోటార్‌ సైకిల్‌ను ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో చంద్రశేఖర్‌రెడ్డి కింద పడిపోయి అక్కడిక్కడే చనిపోయాడు. మరో బైక్‌ నుంచి కింద పడిపోయిన తలారి వెంకటేశ్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. గాయాలైన ఇద్దరిని బోథ్‌ దవాఖానకు తరలించారు. మృతదేహాలను కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోథ్‌ ఎస్సై పి.రాజు తెలిపారు. 


logo