గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 14, 2020 , 02:25:08

జైళ్లశాఖకు రెండు అవార్డులు

జైళ్లశాఖకు రెండు అవార్డులు
  • -తమిళనాడులో అందుకున్న రాష్ట్ర అధికారులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని జైళ్లశాఖకు రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్‌ సెంట్రల్‌ ప్రిజన్‌ క్యాటగిరీలో సెంట్రల్‌ ప్రిజన్స్‌ హైదరాబాద్‌, బెస్ట్‌ ఓపెన్‌ ఎయిర్‌ ప్రిజన్స్‌ క్యాటగిరీలో చర్లపల్లి ప్రిజనర్స్‌ అగ్రికల్చరల్‌ కాలనీకి ఈ అవార్డులు లభించాయి. తమిళనాడులోని వెల్లూరులో ఉన్న అకాడమి ఆఫ్‌ ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఏపీసీఏ) ఈ అవార్డులు ప్రకటించగా, రాష్ట్ర జైళ్లశాఖ తరఫున డీఐజీ ఎంఆర్‌ భాస్కర్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డీ శ్రీనివాస్‌ ఇటీవల ఈ అవార్డులను అందుకున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర జైళ్లశాఖ డీజీ రాజీవ్‌త్రివేది వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ ఐజీ బీ సైదయ్య కూడా పాల్గొన్నారు.


logo