సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 14:21:13

డ్రగ్స్‌ తయారు చేస్తున్న ఇద్దరి అరెస్టు

డ్రగ్స్‌ తయారు చేస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్ : నగరంలో అక్రమంగా డ్రగ్స్‌ తయారు చేస్తున్న ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.  నాచారం హెచ్‌ఎంటీ నగర్‌లో అక్రమంగా డ్రగ్స్‌ తయారు చేస్తున్నారని ఆబ్కారీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి రూ.40 లక్షల విలువైన ఆల్ఫాజోలం పౌడర్‌, యంత్రాలను సీజ్‌ చేశారు. వీరిని విచారించి కూకట్‌పల్లిలోనూ మత్తుపదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించి 5 కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు.  ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మరొకరు పరారీలో ఉన్నారని ఆబ్కారీశాఖ పోలీసులు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.