టెక్నాలజీ వాడకం అంటే ఇదే! స్మార్ట్ఫోన్లు, జియో రాకతో డిజిటల్ పేమెంట్లు పెరిగాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి గల్లీలోని చిన్న కిల్లీ కొట్టు వరకు ఇప్పుడు అందరూ గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నారు. వాళ్లేనా మేమేం తక్కువ తిన్నాం అనుకున్నారో ఏమో! ఇప్పుడు యాచగాళ్లు కూడా కొత్త ట్రెండ్‌కు తెర తీశారు. ఫోన్ పే, గూగుల్ పే క్యూఆర్ కోడ్లు చూపిస్తూ భిక్షాటన చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల, సంకీస గ్రామంలో గురువారం కొందరు హైటెక్ యాచకులు.. పైసల్లేకపోతే ఫోన్‌పే చేయండి అంటూ క్యూఆర్ కోడ్ చూపిస్తూ పైసలగడం కనిపించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా ఎఫెక్ట్ : చలోరె చలోరె చల్
రారండోయ్.. కశ్మీర్ అందాలు చూద్దాం
వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే