గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 00:49:23

వనపర్తికి రెండు అంబులెన్సులు

వనపర్తికి రెండు అంబులెన్సులు

 వనపర్తి: వనపర్తి జిల్లా దవాఖానకు రెండు అంబులెన్సులను అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా దవాఖాన అభివృద్ధి సంస్థ సమావేశంలో కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, డీఎంహెచ్‌వో శ్రీనివాసులతో కలిసి ఆయ న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా తాను నాలుగు అంబులెన్సులు ఇచ్చేందుకు అంగీకరించానని తెలిపా రు. ఇదివరకే ఒకటి ఇవ్వగా మరో రెండు అంబులెన్సులు వనపర్తి జిల్లా దవాఖానకు ఇస్తానని, మరోటి రాష్ట్ర స్థాయిలో అందజేస్తానని వెల్లడించారు. అనంతరం వనపర్తి మండలం రాజపేటకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త దేసు రాములు ఇటీవల మరణించగా.. పార్టీ నుంచి అందించిన రూ. 2లక్షల బీమా చెక్కును ఆయన సతీమణికి అంద జేశారు. అలాగే 23 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. logo