బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 21:10:41

సార్వత్రిక సమ్మెకు టీయూడబ్ల్యూజే మద్దతు

సార్వత్రిక సమ్మెకు టీయూడబ్ల్యూజే మద్దతు

హైదరాబాద్‌ :  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సులభతర వాణిజ్యానికి అవకాశాలంటూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోందని, ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కార్మిక సంఘాలు సమ్మె  ప్రకటించాయి.

దేశవ్యాప్తంగా బ్యాంకులు, రైల్వేలు, రక్షణ రంగంతోపాటు వివిధ రంగాలకు చెందిన  కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో టీయూడబ్ల్యూజే సైతం సమ్మెలో భాగస్వామిగా ఉంటామని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యూనియన్ సభ్యులు ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo