శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 13:36:49

నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్: జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని తాను హామీ ఇవ్వలేదని ప్రకటించిన నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మాట మార్చిన అర్వింద్‌ దిష్టిబొమ్మను రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు దహనం చేశారు. జిల్లాలోని కమ్మర్పల్లి, ఎరుగట్ల, బాల్కొండ తదితర ప్రాంతాల్లో రైతులు, రైతు సంఘాలు, నిజామాబాద్ నగరంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నేతలు ఎంపీ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.

నిన్న చౌట్‌పల్లిలో జరిగిన పసుపు రైతుల ముఖాముఖి సమావేశంలో ఎంపీ అరవింద్ ముఖం చాటేయడం... తాను ఇచ్చిన హామీలను ఇవ్వలేదంటూ అబద్ధాలు ఆడటం పట్ల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకువస్తానని హామీలిచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని, ఇందుకోసం ఎంపీ అర్వింద్ కృషి చేయాలని.. లేదంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నిన్న జరిగిన సమావేశంలో ‘పదిరోజులు గడువిస్తున్నాం.. రాజీనామా చేస్తావో.. పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర తెస్తావో తేల్చుకో’ అని ఎంపీ అర్వింద్‌కు రైతులు డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే.  

VIDEOS

logo