బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 12:20:58

మరికాసేపట్లో తుంగభద్ర పుష్కరాలు..

మరికాసేపట్లో తుంగభద్ర పుష్కరాలు..

అలంపూర్/జోగులాంబ గద్వాల : మరికాసేపట్లో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1. 23 నిమిషాలకు అలంపూర్ ఘాట్ వద్ద బ్రాహ్మణులు, వేద పండితులు శాస్త్రోక్తంగా తుంగభద్ర నదీ పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసత్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు మధ్యాహ్న 1.23 నుంచి పుష్కర స్నానాలు చేయవచ్చని అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు మేరకు భక్తులు పుష్కరాల్లో పాల్గొనాలని కోరారు.