గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 14:36:47

20 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు

20 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు

జోగులాంబ గ‌ద్వాల : అలంపూర్ జోగులాంబ అమ్మ‌వారిని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ‌నివారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య అర్చ‌కులు మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. అనంత‌రం తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేసి ఆశీర్వ‌దించారు. 

ఈ సంద‌ర్భంగా తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆల‌య అధికారులు క‌లిసి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 20 నుంచి డిసెంబ‌ర్ 1వ తేదీ వ‌ర‌కు తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌తో పుష్క‌రాలు నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చామ‌ని చెప్పారు. ఐదు పుష్క‌ర ఘాట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించామ‌ని పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించామ‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.