సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 01:58:41

20 నుంచి తుంగభద్ర పుష్కరాలు

20 నుంచి తుంగభద్ర పుష్కరాలు

  •  అందుబాటులో ఐదు ఘాట్లు
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

అలంపూర్‌/అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఈ నెల 20 నుంచి డిసెంబర్‌ ఒకటి వరకు తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తున్నారు. 20వ తేదీ మధ్యాహ్నం1:23 గంటలకు పుష్కరాలు ప్రారంభమవుతాయి. తెలంగాణలో కేవలం అలంపూర్‌ నియోజకవర్గంలోనే ప్రవహిస్తున్న తుంగభద్ర నది పొడవునా ఈసారి అలంపూర్‌, కలుగోట్ల, పుల్లూరు, రాజోలి, వేణిసోంపురంలో పుష్కరాలకు ఘాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకొన్నారు. ఆలయాల సమీపంలోని తుంగభద్ర నది పుష్కరఘాట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో పుష్కరాలపై సమీక్షించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఈసారి తుంగభద్ర పుష్కరాలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని మంత్రులు సూచించారు.