ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 11:23:52

తుంగభద్ర ప్రకోపానికి.. పదకొండేండ్లు

తుంగభద్ర ప్రకోపానికి.. పదకొండేండ్లు

అయిజ : అక్టోబర్‌ 2 అంటే.. అందరికీ మహాత్మాగాంధీ జయంతి గుర్తుకొస్తుంది.. కానీ ఆ రోజంటే మాత్రం నడిగడ్డ ప్రజల్లో వణుకుపుడుతుంది. రోజుల తరబడి గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు సం బంధాలు తెగిపోయాయి. జీవితాలే అతలాకుతలమైన ఈ సంఘటన మాయని గాయంలా ఉన్నది. నడిగడ్డలో వరద బీభత్సానికి ప దకొండేండ్లు అవుతున్నా.. ఈ సంఘటనలు ఇంకా నడిగడ్డ ప్రజల కండ్లముందే కదలాడుతున్నాయి. పదకొండేండ్ల కిందట ప్రకృతి ప్ర కోపానికి.. కృష్ణా, తుంగభద్ర జీవ నదుల ఉగ్రరూపానికి నడిగడ్డ అతలాకుతలమైంది. అలంపూరు, అయిజ, వడ్డేపల్లి, మానవపా డు, గద్వాల మండలాల్లో వరద బీభత్సం సృష్టించి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. అయిజ మండలంలో తుంగభద్ర నది వరద ఉగ్రరూపానికి గ్రామాలకు గ్రామాలే అతలాకుతలమయ్యా యి. 2009 అక్టోబర్‌ 2న సంభవించిన వరద ప్రభావానికి వేలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద ప్రభావానికి కుటుకనూరు గ్రామం పూర్తిగా ము నిగిపోగా.., రాజాపురం, పులికల్‌, కేశవరం, వేణిసోంపురం, కిసాన్‌నగర్‌ గ్రామాల్లో వేలాది ఎకరాలు కోతకు గురయ్యాయి. 

నేలమట్టమైన నాగల్‌దిన్నె వంతెన..

2009 అక్టోబర్‌ 2న వచ్చిన భారీ వరదలకు అయిజ మండలం పులికల్‌ గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిపై నిర్మించిన నాగల్‌దిన్నె వంతెన పూర్తిగా నేలమట్టమైంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌, కర్ణాటక పరిధిలోని గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అ ప్పటి వరదలకు నాగల్‌దిన్నె వంతెనతోపాటు, కర్ణాటకలోని మాధవరం వద్ద బ్రిడ్జి కూలింది. నాటి సమైక్య పాలనలో మాధవరం బ్రిడ్జిని శరవేగంగా పూర్తి చేసి 2012లోనే రాకపోకలు ప్రారంభించింది. కాగా, నాగల్‌దిన్నె బ్రిడ్జికి సమైక్య ప్రభుత్వం రూ. 42 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచి పనులను ప్రారంభించి నా.. నేటికీ నత్తనడక కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే కర్నూల్‌ జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, బళ్లారి, బెంగుళూరు తదితర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే అవకా శం ఉంటుంది. 27 పిల్లర్లతో నాగల్‌దిన్నె వంతెన పనులను ప్రారంభించిన సిండికేట్‌ కాంటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ గుత్తేదారు ఏపీ వైపున పనులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో 20 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. 2016 మార్చి నాటికి ఈ వంతెన పూర్తి కావాల్సి ఉండగా, ఐదేండ్లుగా గడువును పొడగిస్తున్నప్పటికీ సకాలంలో పూర్తి చేయడంలో గుత్తేదారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికీ నాలుగుమార్లు ఆంధ్ర ప్రభుత్వం గడువు పొడగించినప్పటికీ పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఇరురాష్ర్టాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు ప్రభుత్వం రూ.18.40 లక్షలు విడుదల చేసింది. ప్రస్తుతం తుంగభద్ర నదికి వరద వస్తుండటంతో ప్రయాణికులు వంతెన మీదకు చేరుకుని నడిచి ప్రయాణాలు సాగిస్తున్నారు. 
logo