మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 24, 2020 , 12:28:30

ఆర్డీఎస్ ఆనకట్టకు చేరిన నీరు..

ఆర్డీఎస్ ఆనకట్టకు చేరిన నీరు..

అయిజ (జోగులాంబ గద్వాల) : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇండెంట్ నీరు చేరుకున్నది. తెలంగాణ రాష్ట్రంలోని, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ తాలూకా లో ఆర్డీఎస్ ఆయకట్టులో 20 వేల ఎకరాల్లో యాసంగిలో సాగుచేసిన పంటలకు చివరి తడిగా సాగునీరు అందించాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తుంగభద్ర డ్యాం కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో ఆర్డీఎస్ ఆయకట్టుకు కేటాయించిన 1.08 టీఎంసీల నీటిని నాలుగు రోజులుగా  తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేస్తున్నారు. మంగళవారం తెల్లవారు జామున ఆర్డీఎస్ ఆనకట్టకు నీరు చేరుకున్నది. ఈ నీరు సాయంత్రం వరకు తెలంగాణ రాష్ట్రంలోని ఆయకట్టుకు చేరుతుందని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఆర్డీఎస్ ఆయకట్టు నీరు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo
>>>>>>