శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 23:28:48

ఇంటి ముందు తులసి చెట్టు ఎందుకు?

ఇంటి ముందు తులసి చెట్టు ఎందుకు?

ప్రతిరోజూ ఉదయాన్నే తులసికోట దగ్గర దీపారాధన చేయాలని సంప్రదాయాలు చెప్తున్నాయి. అయితే తులసి మొక్క ముందు కాసేపు ఉండడం వల్ల దాని గాలి తగిలి ఆరోగ్యం చేకూరుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంటి ముందు తులసి మొక్క లేని హిందూ కుటుంబాలు దాదాపుగా ఉండవు. ఇది సంప్రదాయమే కాదు.. ఆరోగ్యదాయకం కూడా. సాధారణంగా ఆరోగ్యానికి లక్ష్మి తులసి, వ్రత సమయాల్లో క్రుష్ణ తులసిని వాడుతుంటారు. వేరు నుంచి పూవు వరకు తులసి లోని అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగివుంటాయి. దోమల వంటి కీటకాల నుంచి రక్షణ కలిగిస్తాయి. పర్యావరణ పరిరక్షణ చేస్తాయి.

ఆఫ్రికా లాంటి దేశాల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మొక్కను ‘ప్లాంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా’ అని కూడా పిలుస్తారు. అంటే మలేరియా జ్వరాల నిరోధానికి, నివారణకు కూడా ఇది పెట్టింది పేరన్న మాట. అన్ని మొక్కలూ రాత్రిపూట ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ ను వదిలితే, అన్ని వేళలా ఆక్సిజన్ ను మాత్రమే వదిలేది ఒక్క తులసి మాత్రమే. కడుపు నొప్పి, ఆమ్ల పిత్తం, దగ్గు-దమ్ము, చర్మ వ్యాధి, కాలేయ సమస్యలు, మూత్రంలో రాళ్లు, దుష్ట వ్రణాలు, పసిపిల్లల వ్యాధులతో పాటు పాము విషానికి కూడా విరుగుడుగా తులసి పనిచేస్తుంది. అందుకే ఇంటి ముందు తులసి మొక్క పెంచుకుని, ప్రతిరోజూ దానికి పూజ చేస్తే అటు సంప్రదాయం నిలబడుతుంది.. ఇటు ఆరోగ్యమూ చేకూరుతుంది. 


logo