బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 18:34:14

TTWRJCCET 2020.. ఫ‌లితాలు విడుద‌ల‌

TTWRJCCET 2020.. ఫ‌లితాలు విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణ గిరిజ‌న గురుకులాల జూనియ‌ర్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన రాత ప‌రీక్షా ఫ‌లితాలు శ‌నివారం విడుద‌ల అయ్యాయి. మార్చి 8న నిర్వ‌హించిన రాత‌ప‌రీక్ష‌కు 10,052 మంది విద్యార్థులు హాజ‌రయ్యారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన విద్యార్థుల‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఫ‌లితాల‌ను పంపారు. మొత్తం 73 గిరిజ‌న గురుకులాల కాలేజీల్లో 7,040 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇత‌ర వివ‌రాలు, ఫ‌లితాల కోసం www.tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్ ను లాగిన్ అవొచ్చు.

రాత ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థులు.. సెల‌క్ష‌న్ కాపీని సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. కాలేజీల్లో చేరే స‌మ‌యంలో సెల‌క్ష‌న్ కాపీతో పాటు హాల్ టికెట్, కులం, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రం, టీసీ, ఒక ఫోటోను తీసుకెళ్లాలి.


logo