ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:30:34

శ్రీవారి దర్శనాలు ఆపం: వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి దర్శనాలు ఆపం: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇప్పట్లో తిరుమలలో శ్రీవారి దర్శనాలు ఆపబోమని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. గురువారం స్థానిక అన్నమయ్యభవన్‌లో అర్చకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా సోకిందని, మరో 25 మంది ఫలితాలు రావాల్సి ఉన్నదని చెప్పారు. కాగా, టీటీడీ సిబ్బంది పెద్దసంఖ్యలో కరోనా బారిన పడుతున్నా దర్శనాలు నిలిపివేయకుండా టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో అడ్డుపడుతున్నారని గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ట్వీట్‌ చేశారు. వారసత్వ అర్చక వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక విధానాలను ఈవో, ఏఈవో అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీక్షితులు వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్‌ ఖండించారు. శ్రీవారి దర్శనాలపై రమణదీక్షితులు తన అభిప్రాయం చెప్పాలనుకొంటే బోర్డును సంప్రదించాలే తప్ప.. సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. logo