శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 02:50:19

మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

  • తిరుమల చరిత్రలోనే తొలిసారి ఏకాంతంగా 
  • ఎస్వీబీసీలో బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉత్సవాలను ఈసారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ బోర్డు చరిత్రలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇలా ఏకాంతంగా నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ నెల 27న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.  శాస్ర్తోక్తంగా అన్ని సంప్రదాయాలను అనుసరించి ఉత్సవాల నిర్వహణకు అంతా సిద్ధంచేశామని తెలిపారు. ఈ నెల 23న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారన్నారు. ఎస్వీబీసీ చానల్‌లో బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చైర్మన్‌ వెల్లడించారు.logo