సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 07:46:43

జూబ్లీహిల్స్‌ టీటీడీ ఆలయంలో 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

జూబ్లీహిల్స్‌ టీటీడీ ఆలయంలో 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

జూబ్లీహిల్స్‌లో కొలువుదీరిన టీటీడీ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 7 నుంచి 17వ తేదీ వరకు కనులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు చెందిన పోస్టర్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, తెలంగాణ లోకల్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ గోవిందహరి, వైస్‌ చైర్మన్‌ కొండా రాఘవరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో లోకల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యులు వెంకట్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


logo