సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 20:20:22

RJCCET-2020 ఫ‌లితాలు విడుద‌ల‌

RJCCET-2020 ఫ‌లితాలు విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు సంబంధించి RJCCET-2020 ఫ‌లితాలు గురువారం విడుద‌ల అయ్యాయి. ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం(ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గ్రూపు)లో ప్ర‌వేశాల కోసం 68,938 మంది విద్యార్థులు.. అర్హ‌త ప‌రీక్ష రాశారు. మొత్తం సీట్లు 10,960. 

ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన విద్యార్థుల‌తో పాటు సాధించ‌ని వారికి కూడా రిజిస్ర్ట‌ర్ మొబైల్ నంబ‌ర్ కు మేసేజ్ పంపిన‌ట్లు అధికారులు తెలిపారు. ఫ‌లితాల కోసం www.tswreis.in.ను సంద‌ర్శించొచ్చు. అర్హ‌త సాధించిన విద్యార్థులంద‌రూ.. జులై 1వ తేదీ నుంచి 10వ తేదీ మ‌ధ్య‌లో రిపోర్టు చేయాల‌ని సూచించారు. సంబంధిత ప‌త్రాలైన హాల్ టికెట్, కులం, ఆదాయ ధృవ‌ప‌త్రాలు, టీసీ, సెల‌క్ష‌న్ కాపీతో పాటు పాస్ పోర్టు సైజు ఫోటో తీసుకెళ్లాలని విద్యార్థుల‌కు చెప్పారు. నిర్ణీత స‌మ‌యంలో విద్యార్థులు రిపోర్టు చేయ‌క‌పోతే.. సీటు ర‌ద్దు అవుతుంద‌ని తెలిపారు.


logo