బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 16:30:49

TSWREIS : ఐదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌పై ఆందోళ‌న వ‌ద్దు

TSWREIS : ఐదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌పై ఆందోళ‌న వ‌ద్దు

హైద‌రాబాద్ : తెలంగాణ గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు సంబంధించి సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తున్న పుకార్ల‌పై గురుకులాల సొసైటీ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. సాంఘిక‌, గిరిజ‌న‌, బీసీ, జ‌న‌ర‌ల్ గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల‌కు సంబంధించి వీటీజీ-సెట్ 2020ను విడుద‌ల చేశారు. నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. ఏప్రిల్ 12న రాత ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉండే. అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా రాత ప‌రీక్ష‌ను వాయిదా వేయ‌డం జ‌రిగింది. రాష్ర్ట ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకుని రాత ప‌రీక్ష ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని సోసైటీ స్ప‌ష్టం చేసింది. 

తెలంగాణ గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తి అడ్మిష‌న్ల‌ను లాట‌రీ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని తేల్చిచెప్పింది. ఈ పుకార్ల‌ను త‌ల్లిదండ్రులు, విద్యార్థులు న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని సొసైటీ తెలిపింది. 


logo