గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 18:57:20

అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చాక ఆర్టీసీ సేవలు

అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చాక ఆర్టీసీ సేవలు

ఖమ్మం: జిల్లాలోని అల్లిపురం కొనుగోలు కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ నాగభూషణం, మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కార్గో సేవలను వ్యవసాయం, మార్క్‌ఫెడ్‌లకు అనుసంధానం చేశాం. మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల నుంచి కార్గో ద్వారా మార్క్‌ఫెడ్‌ గోదాంలకు తరలిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 100 కార్గో బస్సులు మొక్కజొన్న తరలించేందుకు వాడుతున్నాం. అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చాక ఆర్టీసీ సేవల ప్రారంభంపై ఆలోచిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం తర్వాతే ఆర్టీసీ బస్సులు నడపడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 


logo