ముంబై: తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశగా దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంకే స్టాలిన్‌కు, అతని బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. తమిళ సంస్కృతిని, ప్రాంతీయ గుర్తింపును కాపాడుకోవడం కోసం మీరు మీ తండ్రి కరుణానిధి వేసిన మార్గంలో నడుస్తున్నారు. మీరు మీ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నందుకు మరోసారి అభినందనలు తెలుపుతున్నా అని స్టాలిన్ తన సందేశంలో పేర్కొన్నారు.