బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 01:49:05

సంక్రాంతి స్పెషల్‌ బస్సులు 4,980

సంక్రాంతి స్పెషల్‌ బస్సులు 4,980

 సుల్తాన్‌బజార్‌, జనవరి 2: సంక్రాంతి పండుగ సందర్భంగా 4980 అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ బీ వరప్రసాద్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్‌ బస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 3,380.. ఆంధ్రప్రదేశ్‌కు 1600ల బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ముందస్తుగానే సీట్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. ఈ నెల 22 నుంచి 24 వరకు నడిపే బస్సుల్లో సీట్లు బుక్‌ చేసుకొనేందుకు ప్రయాణికులు www.tsrtconline.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. సందేహాలకు ఎంజీబీఎస్‌-83309 33537,జేబీఎస్‌ 040-27802203 నంబర్లలో సంప్రదించవచ్చని ఆర్‌ఎం వెల్లడించారు.logo