మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:15:32

ఆర్టీసీలో క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు

ఆర్టీసీలో క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు

హైదరాబాద్‌, సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడిలో భాగంగా గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా ప్రయాణికులు టికెట్‌ చార్జీలను చెల్లించేలా టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూఆర్‌కోడ్‌ ఆధారంగా డబ్బులు చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. కర్ణాటకలో ఇలాంటి విధానం అమలవుతున్నది. ఈ విధానాన్ని మొదటిదశలో దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా అమలుచేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.logo