ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 21:38:45

టీఆర్‌టీ 325 పోస్టుల‌కు టీఎస్‌పీఎస్‌సీ ఫ‌లితాల విడుద‌ల‌

టీఆర్‌టీ 325 పోస్టుల‌కు టీఎస్‌పీఎస్‌సీ ఫ‌లితాల విడుద‌ల‌

హైద‌రాబాద్ : టీచ‌ర్స్ రిక్రూర్‌మెంట్ టెస్ట్‌(టీఆర్‌టీ) కింద నోటిఫై చేసిన 31,048 పోస్టుల నియామ‌కాల‌ను పూర్తి చేస్తూ తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్‌సీ) గురువారం 325 పోస్టుల ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. 325 ఖాళీల‌లో మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌రేట్‌(డీఎంఈ) కింద 167 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కం అదేవిధంగా 158 స్కూల్ అసిస్టెంట్(హిందీ) పోస్టుల‌కు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. స్కూల్ అసిస్టెంట్ (హిందీ) కి సంబంధించి సర్టిఫికేట్ ధృవీకరణను నిర్ణ‌యించిన వివిధ తేదీల్లో ఆరు ద‌శ‌ల్లో జ‌రగ‌నున్న‌ట్లు తెలిపింది. గుర్తించిన 158 పోస్టుల్లో 148 పోస్టుల భ‌ర్తీని మాత్ర‌మే చేప‌ట్టారు. అర్హులైన అభ్య‌ర్థులు లేనికార‌ణంగా మూడు పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు అదేవిధంగా కోర్టు కేసుల కార‌ణంగా రెండు పోస్టుల ఫ‌లితాలు పెండింగ్‌లో ఉన్న‌ట్లు, మెడిక‌ల్ రిపోర్టుల అనంత‌రం పీహెచ్ కోటాలోని ఐదు ఖాళీలకు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది.