హైదరాబాద్ : రాష్ట్రంలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల(127) భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మే 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. అప్లికేషన్ ఫారంలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాల్సిందిగా తెలుపుతూ జులై 13వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆగస్టు 16వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ ఉంది.
అయితే అదే రోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నిర్వహిస్తున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL) టైర్ 1 పరీక్ష ఉన్నందున ఈ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు టీఎస్పీఎస్సీని కోరారు. విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ సానుకులంగా స్పందించి అభ్యర్థులుకు నష్టం కలగకుండా పరీక్షను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.