మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 21:00:45

వివిధ పోస్టుల పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

వివిధ పోస్టుల పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

హైద‌రాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) శుక్రవారం వివిధ పోస్టుల నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. వరంగల్‌లోని కేఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల పరీక్ష నవంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వ‌హ‌ణ‌. హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్‌లో మేనేజర్ల పోస్టుల పరీక్ష నవంబర్ 12న, పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్ష నవంబర్ 7 న జరుగ‌నుంది. ఈ రాత పరీక్షలను హెచ్ఎండీఏ ప‌రిధిలోని కేంద్రాల్లో నిర్వ‌హించ‌నున్నారు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా అధికారులు సూచించారు. 


logo