శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 01:40:42

40 రోజుల్లో 230 కోట్ల ఆదాయం

40 రోజుల్లో 230 కోట్ల ఆదాయం

  • మొదటి త్రైమాసికంలో టీఎస్‌ఎండీసీ ఘనత
  • 38.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని గడించిన రికార్డును తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) సొంతం చేసుకున్నది. ఇసుక విక్రయాల ద్వారా టీఎస్‌ఎండీసీకి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.230 కోట్ల ఆదాయం సమకూరింది. లాక్‌డౌన్‌ సమయంపోను కేవలం నలభై రోజుల్లోనే ఈ ఆదాయం వచ్చింది. వానకాలం అవసరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 38.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను టీఎస్‌ఎండీసీ అందుబాటులో ఉంచింది. 

రాష్ట్రంలో 19 జిల్లాల పరిధిలో గోదావరి, కృష్ణా, వాటి ఉపనదుల్లో ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 63 ప్రాంతాల్లో ఒండ్రుమట్టి నుంచి ఇసుక తీయడంతోపాటు మేటలు వేసిన ఇసుకను తొలగించేందుకు 199 పట్టాభూములను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 321 ఇసుకరీచ్‌ల ద్వారా 4.54కోట్లు క్యూబిక్‌ మీటర్లు అందుబాటులో ఉన్నండగా, అత్యధికంగా జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో 1.94 కోట్ల క్యూబిక్‌ మీటర్లు ఉండటం విశేషం. 


logo