ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 02:05:56

వేగంగా మీడియా అకాడమీ భవన నిర్మాణం

వేగంగా మీడియా అకాడమీ భవన నిర్మాణం

  • ఇంజినీర్లను కోరిన చైర్మన్‌ అల్లం నారాయణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా అందుబాటులోకి తేవాలని అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లను కోరారు. నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని శనివారం ఆయన అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. జర్నలిస్టులు అందరికీ ఉపయోగకరంగా ఉండేలా బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నామని, ఇందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని అల్లం నారాయణ  చెప్పారు.


logo