మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 02:06:15

అరచేతిలో వాతావరణ సమాచారం

అరచేతిలో వాతావరణ సమాచారం

  • ‘టీఎస్‌- వెదర్‌' మొబైల్‌యాప్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ఇయ్యాల పొలంకాడ ఒడ్లు ఆరబెడితే వాన పడుతుందేమోనని ఓ రైతు భయం.! పనిమీద బయటకు వెళ్లాలి వర్షం కురుస్తుందేమోనని ఓ ప్రయాణికుడి ఆందోళన.!.. ఎండలు మండుతాయా? చలిపంజా విసురుతుందా? ఇలాంటి వాతావరణ సమాచారం ఇక మన అరచేతిలో దొరుకనున్నది. రైతులు, సామాన్యులకు సైతం ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం ఇచ్చేందుకు ‘టీఎస్‌-వెదర్‌' మొబైల్‌యాప్‌ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంస్థ (టీఎస్‌డీపీఎస్‌) ఈ యాప్‌ను రూపొందించింది. మొబైల్‌ యాప్‌ పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో టీఎస్‌డీపీఎస్‌ అధికారులతో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రణాళికా విభాగం డైరెక్టర్‌ షేక్‌మీరా, అర్థగణాంకశాఖ డైరెక్టర్‌, టీఎస్‌డీపీఎస్‌ ఇంచార్జి సీఈవో దయానంద్‌, అధికారులు రామకృష్ణ, ప్రసాద్‌, వేణుమాధవ్‌, ముకుంద్‌రెడ్డి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


logo