మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 21:16:20

ఈద్గాల‌లో ఈద్‌-ఉల్‌-ఆదా ప్రార్థ‌న‌లు లేవు : టీఎస్ వక్ఫ్ బోర్డు

ఈద్గాల‌లో ఈద్‌-ఉల్‌-ఆదా ప్రార్థ‌న‌లు లేవు : టీఎస్ వక్ఫ్ బోర్డు

హైదరాబాద్: కోవిడ్ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ఈద్గాల‌లో ఈసారి బ‌క్రీద్ ప‌ర్వ‌దినాన ఈద్-ఉల్-అధా ప్రార్థనలు అనుమతించబడవ‌ని తెలంగాణ వ‌క్ఫ్ బోర్డు పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను గురువారం నాడు వెలువ‌రించింది. ముస్లింలు తమ ఇళ్లలో మాత్రమే ప్రార్థనలు చేయాల్సిందిగా సూచించింది. ఈద్ ప్రార్థనల సందర్భంగా స్వ‌ల్ప‌ ఉపన్యాసాలు మాత్ర‌మే నిర్వహించాలంది. ప్రార్థనల సమయంలో భౌతిక‌దూరం పాటించేలా చూడాలంది.

ప్రార్థనలకు హాజరయ్యే వ్యక్తుల సంఖ్యను ముందే నిర్ణయించాలని ఆ సంఖ్య చేరుకున్నప్పుడు గేట్లను మూసివేయాలని మసీదు కమిటీలను కోరింది. అదేవిధంగా మసీదు పరిసరాల్లో పరిశుభ్రత పాటించేలా చూడాలంది. మసీదుకు వచ్చే వారు తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించింది. ఒకరినొకరు కౌగిలించుకోకుండా బదులుగా శుభాకాంక్షలు చెప్పుకోవాలని పేర్కొంది.


logo