10 రోజుల్లో టెట్ నోటిఫికేషన్?

హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సారి ఆన్లైన్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రిపరేషన్‌కు 8 వారాలు సమయమిచ్చి పరీక్ష నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సుమారు 50 వేల ఉద్యాగాలు భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో టీచర్, పోలీసు ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. టీచర్ ఉద్యోగాల భర్తీకి టెట్ తప్పనిసరి కావడంతో, ఈ అర్హత పరీక్షను నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. మరో పదిరోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడనుంది.
ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు సార్లు టెట్ నిర్వహించారు. కాలపరిమితి ఏడేళ్లు కావడంతో ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన మూడు టెట్ల స్కోర్‌కు గడువు ఇప్పటికే తీరిపోయింది. చివరి సారిగా 2014 మార్చిలో నిర్వహించిన టెట్ కాలపరిమితి కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి ముగుస్తుంది.
రాష్ట్రంలో 2016 మేలో మొదటిసారి, 2017 జులై 23న చివరిసారిగా పరీక్ష జరిపారు. అంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిపిన పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారే ఉపాధ్యాయ కొలువులకు నిర్వహించే టీఆర్టీకి అర్హులవుతారు. అందుకే మరోసారి పరీక్ష జరపనున్నారు. ఈ సారి టెట్ పరీక్ష జరిపితే దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది బీఈడీ, డీఈడీ పూర్తయిన వారు హాజరయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
- టెస్లా మస్క్ స్టైలే డిఫరెంట్.. పన్ను రాయితీకే ప్రాధాన్యం
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు